APTEACHERS

APTEACHERS Website Official Telegram Channel
లేటెస్ట్ విద్యా ఉద్యోగ సమాచార చానెల్
Latest Educational AP Employees, AP Teachers Information
Official Website
http://www.apteachers.in

View in Telegram

Recent Posts

*♻️జూన్ కల్లా టీచర్*
*పోస్టుల భర్తీ*

*శాసనసభలో మంత్రి లోకేశ్*

*ఉపాధ్యాయులపై తప్పుడు కేసులు ఎత్తేస్తామని వెల్లడి*


వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల్లో భాగంగా శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు,లోకం మాధవి, కాకర్ల సురేష్ డిఎస్సీ నోటిఫికేషన్,ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్
సమాధానమిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబునాయుడు డిఎస్సీ ఫైలుపైనే తొలి సంతకంచేశారు. ఎటువంటి లీగల్ లిటిగేషన్లు లేకుండా టీచర్ పోస్టులభర్తీచేయాలన్నదే తమ లక్ష్యం. 1994 నుంచి కేసుల వివరాలుతెప్పించాం. పకడ్బందీగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించాం. టీచర్ పోస్టుల భర్తీకి చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నాం. డిఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి ఎంతసడలింపు ఇవ్వాలో కూడా నిర్ణయిస్తామని లోకేశ్ తెలిపారు.1994కి ముందు జిల్లాపరిషత్ అధ్వర్యంలో టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగేదని... ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే15 డిఎస్సీలు నిర్వహించి... 2.20లక్షల పోస్టులు నోటిఫై చేసి,1.80లక్షల పోస్టులు భర్తీచేయడం జరిగిందని తెలిపారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డిఎస్సీ ద్వారా భర్తీచేసినపోస్టులు సున్నా అని విమర్శించారు. ఎన్నికలకు రెండునెలలముందు 12-2-2024న నిరుద్యోగులను మభ్యపెట్టడానికిహడావిడిగా 6,100 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారని... ఆ తర్వాత ప్రక్రియ ముందుకు సాగలేదన్నారు. జీవో 117 తెచ్చి స్కూళ్ల విలీనం పేరుతో గత ప్రభుత్వం పేద విద్యార్థులు, టీచర్లను ఇబ్బందులకు గురిచేసిందని, సమాజంలో మార్పునకు కారణమైన టీచర్లను గత ప్రభుత్వం పనిగట్టుకొని వేధించిందని మండి పడ్డారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ స్కూళ్లలో 6లక్షలమంది విద్యార్థులు తగ్గిపోయారు. తమ సమస్యలపై ఉపాధ్యాయులు ధర్నాలు చేసినపుడు దొంగకేసులు పెట్టారు.ఆ కేసులన్నీ డీజీపీతో మాట్లాడి తొలగిస్తాం. రాబోయే అయిదేళ్లలో ఏపీలో మోడల్ ఎడ్యుకేషన్ తెస్తామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

*✳️ప్రైవేటుకు దీటుగా ఇంటర్ లో సంస్కరణలు*

*ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ఇంటర్మీడియట్ విద్యలో వివిధ సంస్కరణలు తీసుకువస్తున్నామని, శాసనసభలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 15వేల అడ్మిషన్లు పెరిగాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లకు ర్యాంకింగ్ మెకానిజం తెచ్చి మౌలికవసతులు అభివృద్ధి చేస్తాం. శాసనసభ్యులు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి ఫీడ్ బ్యాక్ రిపోర్టు ఇవ్వాలని కోరారు. ఏం చేస్తే బాగుంటుందో మీరు ఇచ్చే సలహాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. డిగ్రీ కాలేజిలను ఇండస్ట్రీ సెంట్రిక్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని లోకేశ్ వెల్లడించారు.
*ఇకపై బేసిక్ ప్రైమరీ, మోడల్ ప్రైమరీ పాఠశాలలు*

*మే 31 నాటికి పదోన్నతులు, బదిలీలు పూర్తి*

*అమరావతి, ఆంధ్రప్రభ:* వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలను రెండు విధాలుగా విభజించనున్నది. బేసిక్ ప్రైమరీ, మోడల్ ప్రైమరీ పాఠశాలలుగా ప్రాథమిక పాఠశాలలను మార్చనున్నది. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరుపుతున్నారు. గతంలో జరిగిన సమావేశాల్లో ప్రధానంగా బదిలీల చట్టం, పదోన్నతులు, జీవో 1217 రద్దుపై చర్చలు జరిపారు. ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు, ప్రతిపాదనలను స్వీకరించారు. తాజాగా శుక్రవారం జరిగిన సమావేశంలో వచ్చే యేడాది ప్రవేశపెట్టనున్న బేసిక్ ప్రైమరీ, మోడల్ ప్రైమరీ పాఠశాలల రూపకల్పనపై చర్చ జరిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబోయే పలు కీలక అంశాలను వెల్లడించారు. అన్ని జిల్లాల్లో సీనియారిటీ జాబితాలను మెరిట్ కం రోస్టర్ విధానంలో తయారుచేసి షెడ్యుల్ ప్రకారం పదోన్నతులు, బదిలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Government appointed Sri Rajiv Ranjan Mishra, I.A.S.(Retd.) as One Man Commission to suggest the specific recommendations on sub-classification of Scheduled Castes to ensure the benefits of reservation policies are equitably distributed among the various sub-groups of Scheduled Castes in the State of Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో వన్ మాన్ కమిషన్ నియమించిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్
నేడు విజయవాడ విద్యా భవన్ నందు విద్యాశాఖ కమిషనర్ శ్రీ విజయరామరాజు గారు ఉపాధ్యాయ సంఘాలతో జీవో 117 మార్పు, ఉపాధ్యాయ బదిలీల కోడ్ డ్రాఫ్ట్ ప్రపోజల్స్ గురించి సవివరంగా చర్చించడం జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్యాంశాలు;
- *మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ డిసెంబర్ 5న నిర్వహిస్తారు*
- *డిసెంబర్ నెలలో విద్యాశాఖ మంత్రి గారు ఉపాధ్యాయ సంఘాలతో డ్రాప్ట్ ప్రతిపాదనలపై, ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ పై సమావేశం నిర్వహిస్తారు*.
- *సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు డిసెంబర్ 9 నుంచి 14 వరకు నిర్వహిస్తారు*
- రోడ్ మ్యాప్ అండ్ టీచర్ సర్వీసెస్:
- నవంబర్ 30న జీవో 117 రద్దు పై, ట్రాన్స్ఫర్ కోడ్ పై ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పిస్తారు.
- టీచర్ ప్రొఫైల్ అప్డేషన్ కు మొదటిది విడతగా డిసెంబర్ 20 వరకు, రెండో విడత గారు జనవరి 20 వరకు, మూడవ విడతగా ఫిబ్రవరి 10 వరకు అవకాశం ఇస్తారు.
- టీచర్ ప్రొఫైల్ అప్డేషన్ బట్టి ప్రమోషన్లు సీనియారిటీ లిస్టు తయారు చేస్తారు.
- ఫిబ్రవరి 10 తర్వాత అవకాశం ఇవ్వరు.
- ట్రాన్స్ఫర్ షెడ్యూల్:
- ప్రధానోపాధ్యాయులకు ఏప్రిల్ 10 నుంచి 15 వరకు, స్కూల్ అసిస్టెంట్లకు ఏప్రిల్ 21 నుంచి 25 వరకు, ఎస్ జి టి లకు మే ఒకటి నుంచి పది వరకు నిర్వహిస్తారు.
- ప్రమోషన్ షెడ్యూల్:
సీనియార్టీ లిస్టులను మొదటి విడుదల ఫిబ్రవరి 15, రెండవ విడతగా మార్చి 1 మూడో విడతగా మార్చి 15న డిస్ప్లే చేస్తారు.
- *డీఎస్సీ రిక్రూట్మెంట్ మే 11 నుంచి 30 లోపు ముగిస్తారు*

- *జీవో 117 ను రద్దుచేసి మార్పుకు సంబంధించి డ్రాఫ్ట్ ప్రతిపాదనలు సంఘాలకు తెలియజేయడం జరిగింది*.
- ప్రాథమిక పాఠశాలలు రెండు రకాలుగా అనగా బేసిక్ ప్రైమరీ స్కూల్స్, మోడల్ ప్రైమరీ స్కూల్స్ గా ఉంటాయి.
- బేసిక్ ప్రైమరీ స్కూల్స్ లో 30 వరకు ఒక టీచర్, ప్రతి 30 మందికి ఒక టీచర్ ను నియమిస్తారు.
- మోడల్ ప్రైమరీ స్కూల్స్ లో ప్రతి తరగతికి ఉపాధ్యాయుడు ఇస్తారు. వంద మంది విద్యార్థులు దాటిన పాఠశాలకు ఒక పిఎస్ హెచ్ఎం కేటాయిస్తారు.
- 13000 పంచాయతీలకు గాను 6000 పంచాయితీలు పైగా మోడల్ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేస్తారు.
- ప్రాథమికోన్నత పాఠశాలలో 6 ,7, 8 తరగతి విద్యార్థులు 60 మంది దాటితే ఉన్నత పాఠశాలలుగా అప్ గ్రేడ్ చేస్తారు.
- 6, 7 ,8 తరగతుల విద్యార్థులు 30 కన్నా తక్కువ ఉంటే ప్రాథమిక పాఠశాలగా కొనసాగిస్తారు.
- ప్రాథమికోన్నత పాఠశాలలో 6, 7, 8 తర్వాత విద్యార్థులు 31 నుంచి 59 వరకు ఉంటే వాటిని కొనసాగించడం గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
- ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 75 దాటిన పాఠశాలలకు గ్రేడ్ II హెడ్మాస్టర్ పోస్టు, పిడి పోస్ట్ కేటాయిస్తారు.
- సెక్షన్ల వారీగా ఉపాధ్యాయులను కేటాయిస్తారు.
- ఉపాధ్యాయులకు పనిభారం 36 కు మించకుండా ప్రయత్నం చేస్తారు.
- నవంబర్ 30 నాటికి డ్రాఫ్ట్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పిస్తారు.
- క్షేత్ర స్థాయిలో అభిప్రాయాలు కూడా తెలుసుకుంటారు.

- బదిలీలకు సంబంధించి ప్రతిపాదనలు:

- టీచర్స్ కు కనీసం రెండు సంవత్సరాలు గరిష్టంగా ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి.
- గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులకు కనీసం రెండు సంవత్సరాలు గరిష్టంగా ఐదు సంవత్సరాలు.
- స్కూల్ క్యాటగిరీలను 16% చేరి వాటిని కేటగిరి A గా ఒక పాయింట్, 12% హెచ్ఆర్ఏ పాఠశాలలను కేటగిరి B గా రెండు పాయింట్లు, 10% హెచ్ఆర్ఏ స్కూళ్లలో 5000 జనాభా పై ఉన్న ప్రాంతాలను కేటగిరి C గా మూడు పాయింట్లు, 10% హెచ్ఆర్ఏ స్కూళ్లలో 5000 కన్నా జనాభా తక్కువ ఉన్న ప్రాంతాలను కేటగిరి D గా నాలుగు పాయింట్లు కేటాయిస్తారు.
- సర్వీస్ పాయింట్ ఒక సంవత్సరానికి ఒక పాయింట్ కేటాయిస్తారు(గతంలో 0.5 గా ఉండేది)
- స్పెషల్ కేటగిరి పాయింట్లు అన్ మ్యారీడ్ ఉమెన్, పీహెచ్ 40 నుండి 69 శాతం వరకు, 15 సంవత్సరాల లోపు పిల్లల గల వితంతువులకు, భార్య మరణించిన పురుష ఉపాధ్యాయులకు, NCC, కేంద్ర భద్రత బలగాల పనిచేస్తున్న వారి స్పౌజ్ కు, ఎక్స్ సర్వీస్ మెన్ కు, గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర మరియు 26 జిల్లాల బాధ్యులకు ప్రత్యేక పాయింట్లు కేటాయిస్తారు.
- పీహెచ్ 70% కన్నా ఎక్కువ ఉన్న ఉపాధ్యాయులకు, క్యాన్సర్, డయాలసిస్, అవయవ మార్పిడి చేసుకున్న తదితర ఎక్కువ తీవ్రత గల వ్యాధులతో బాధపడుతున్న వారిని. ప్రిఫరెన్షియల్ క్యాటగిరీ కింద తీసుకుంటారు
- POCSO కేసులు, డిసిప్లనరీ యాక్షన్స్ ఉన్న టీచర్లకు మైనస్ పాయింట్లు ఇస్తారు.
- పర్ఫామెన్స్ పాయింట్లు పై ఇంకా చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
- డీఎస్సీ నోటిఫికేషన్ మరో 10 రోజుల లోపు ప్రజలు కావచ్చు అని తెలియజేశారు.
- పాఠశాలల సమయాన్ని 9 నుంచి 5 వరకు ప్రార్థన సమయం, ఇంటర్వెల్, లంచ్ బ్రేక్ సమయాలను పెంచి నిర్వహిస్తే ఎలా ఉంటుందని అభిప్రాయం క్షేత్రస్థాయిలో కూడా తెలుసుకొని నిర్ణయం తీసుకుంటామన్నారు.
♻️Pensioners Annual Verification (Life) Certificates from all the pensioners for the F.Y. 2025-26 during the period will be from 01.01.2025 to 28.02.2025
https://www.apteachers.in/2024/11/pensioners-annual-life-certificates-av.html
♻️Birth Certificates issued by Govt Medical Institutions are Proof for Date of Birth Corrections in Aadhar UPDATION

▪️Birth certificates issued by Government Medical Institutions are only consider for Date of Birth correction in Aadhaar in addition to the certificates issued by the Panchayath Secretaries and Municipal Authorities.

▪️ఆధార్ లో పుట్టిన తేదీలో మార్పుల కొరకు, ప్రభుత్వ వైద్య సంస్థలు జారీ చేసిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా మున్సిపల్ లేదా పంచాయతీ సెక్రెటరీ లు జారీ చేసిన సర్టిఫికేట్ లను పరిగణంలో తీసుకోవాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ

▪️పూర్తి కాపీ కింది వెబ్ పేజీ లో చూడవచ్చు
https://www.apteachers.in/2024/11/birth-certificates-issued-by-govt.html
Meeting with CSE Highlights

ఈరోజు డైరెక్టరు గారితో జరిగిన ఉపాధ్యాయ సంఘాల సమామావేశంలో ప్రధానంగా బదిలీచట్టం పదోన్నతులు 117 జివో లపైచర్చ జరిగింది.
ప్రాధమికంగా Draft నిబంధనలు రూప కల్పన పై చర్చజరిగింది
AP model of Education Document రూపకల్పన కు విద్యాశాఖామంత్రి, కార్యదర్శి, డైరెక్టరు త్వరలో సమావేశం ఏర్పాటుచేసి సంఘాల అభిప్రాయ సేకరణ చేస్తారు.

1) 117జి వో :-
ప్రాధమిక పాఠశాలలలో 3,4,5 తరగతులు 4731 పాఠశాలలు UP/ZPHS లో mapping అయ్యాయి.
5475 SGT పోస్టులు అప్గ్రేడ్ చేసి 2486 సర్ప్లస్ SGT లను కలిసి మొత్తం 796I స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అప్గ్రేడ్ అయ్యాయి
2,43,540 విద్యార్థులు ఈ Mapping ద్వారా HS / UP లకు Mapping అయ్యారు .

2) పదో న్నతులు:- అన్ని జిల్లాల్లో సీనియారిటీజాబితాలను మెరిట్ కం రోస్టర్ విధానంలో తయారుచేసి షెడ్యుల్ ప్రకారం పదోన్నతులు బదిలీలు నిర్వహిస్తారు. ఇవన్నీ మే నెలాఖరుకు పూర్తి చేసి జూన్ నెల ఒకటో తేదీన కొత్త పాఠశాలలో చేరే విధంగా షెడ్యూల్ రూపొందిస్తారు. ప్రాథమిక పాఠశాలలు రెండు రకాలుగా ఉండబోతున్నాయి.

1) బేసిక్ ప్రైమరీ స్కూల్
2)మోడల్ ప్రైమరీ స్కూల్

బేసిక్ ప్రైమరీ స్కూల్:- 20 లోపు పిల్లలు ఉంటే ఒక SGT పోస్టును, 60 మంది పిల్లలు వరకు రెండు SGT పోస్టులను ఆపై ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక SGT పోస్టు చొప్పున కేటాయిస్తారు. ఇవి కేవలం మోడల్ ప్రైమరీ స్కూల్ నిర్వహించడం కష్టతరమైన ప్రాంతాల్లోనే ఇవి ఉంటాయి

మోడల్ ప్రైమరీ స్కూల్ :- కనీసం వంద మంది విద్యార్థులతో(STU రోల్ తో నిమిత్తం లేకుండా ఏర్పాటు చేయాలని కోరింది) ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుని కేటాయిస్తూ 120 మంది పిల్లలు కంటే ఎక్కువ ఉన్న పాఠశాలకు ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ పోస్టు కేటాయించే ఆలోచన చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలకు 1:30, ఉన్నత పాఠశాలలకు 1:35 విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని నిర్ణయిస్తారు. యూపీ పాఠశాలలో 6 7 8 తరగతి విద్యార్థులు 30 కంటే తక్కువ ఉంటే దాన్ని ప్రాథమిక పాఠశాలలుగా డీగ్రేట్ చేస్తారు. 60 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే దానిని ఉన్నత పాఠశాలగా అప్ గ్రేట్ చేస్తారు ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 తరగతి వరకు 75 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉంటే అక్కడ ప్రధానోపాధ్యాయులను పిడి పోస్టులను కేటాయిస్తారు

బదిలీలు:- ప్రతి సంవత్సరం మే 31వ తేదీ నాటికి ఉన్న ఖాళీలను పరిగణలోకి తీసుకొని బదిలీలు నిర్వహించి జూన్ ఒకటో తేదీన పాఠశాలలో చేరే విధంగా ఉత్తర్వులు ఇస్తారు ప్రధానోపాధ్యాయులకు కనీసం రెండు సంవత్సరాల సర్వీసు గరిష్టంగా ఐదు సంవత్సరాల సర్వీసును, ఉపాధ్యాయులకు కనీసం రెండు సంవత్సరాల సర్వీసు గరిష్టంగా 8 సంవత్సరాలు సర్వీసును పరిగణలోకి తీసుకుంటారు.
16% హెచ్ఆర్ఏ స్థానాలని A కేటగిరీ గాను 12% హెచ్ఆర్ ని B కేటగిరి గాను, 10 శాతం HRA 5వేల జనాభా కంటే ఎక్కువ ఉంటే C క్యాటగిరి గాను, 5000 కంటే తక్కువ జనాభా ఉంటే D కేటగిరి గాను నిర్ణయించి కేటగిరి ఏ కు ఒక పాయింట్ బీ కు రెండు పాయింట్లు సి కి మూడు పాయింట్లు డి కి నాలుగు పాయింట్లు చొప్పున బదిలీల లో కేటాయిస్తారు. స్పెషల్ మరియు ప్రిఫరెన్షియల్ కేటగిరీకి సంబంధించి కొన్ని సూచనలు సంఘాలను చేయడం జరిగింది వీటిపై పూర్తి వివరాలతో తదుపరి మీటింగ్లో నిర్ణయించి డ్రాఫ్ట్ రూల్స్ ను విడుదల చేస్తారు.
*ఈ రోజు సమగ్ర శిక్ష ఎస్.పి.డి. శ్రీనివాస్ గారు నిర్వహించిన సమావేశంలో టీచర్స్ ట్రైనింగ్ కు సంబంధించిన చర్చ జరిగింది. ట్రైనింగ్ కు సంబంధించి టీచర్లకు ఈ క్రింది విధంగా వెసులుబాటు ఇచ్చేందుకు నిర్ణయించారు.*


* ఇకపై జరిగే ట్రైనింగులన్నీ ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే జరుగుతాయి.

* ట్రైనింగ్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంటుంది.

* కంటెంట్ తగ్గిస్తారు. క్లాసుకు, క్లాసుకు మధ్య 10ని. రిలాక్సేషన్ యాక్టివిటీ గాని, రీసెస్ గాని ఉంటుంది.

* మెడికల్ గా ఇబ్బందులు ఉన్నవారికి ప్రస్తుతం ట్రైనింగ్ నుండి మినహాయింపు ఇస్తారు. వారికి ఆన్ లైన్ లో ట్రైనింగ్ ఇచ్చే ఆలోచన చేస్తారు.

* ట్రైనింగు పడినవారు ఎవరికైనా సమస్య ఉండి మినహాయింపు కోరితే తగిన కారణాలు చూపితే వారికి మినహాయింపు ఇస్తారు.

* ఆరోగ్యపరంగా ఇబ్బందులున్న వారు యోగా, కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొన నవసరం లేదు.

* ట్రైనింగ్ సెంటర్స్ లో మెడికల్ ఫెసిలిటీస్ కల్పిస్తారు.

యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ
♻️AP Panchayat Secretaries - Promotion Channel - Feeder Categories - GO 65 Dated 15.11.2024

పంచాయతీ కార్యదర్సుల పదోన్నతి ల కొరకు 84 జి.ఓ లో కీలక సవరణలు చేస్తూ మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం....పై సవరణ లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ తత్సమాన పే స్కేల్ కలిగిన గ్రేడ్ 4 కార్యదర్సులు మరియు గ్రామ పంచాయతీ లలో పని చేస్తున్న జూ.స ల తదుపరి పదోన్నతి గ్రేడ్ 3 గా నిర్ధారిస్తూ సవరణ చేస్తూ మార్గదర్శకాలు విడుదల

పూర్తి వివరాల కాపీ
https://www.gsws.info/2024/11/ap-panchayat-secretaries-promotion.html
Dear MEOs & HMs ...
Good afternoon 🙏

Pls note:
As per the instructions from the authorities, the dates for complex meetings during November month are revised to be conducted on 19th and 20th of this month instead of 18th and 19th.

Proceedings with revised dates will be duly sent.
Thank you
*మెగా డీఎస్సీ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు*

*డిసెంబర్ మొదటి వారంలో పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నాo...*


*ఏపీ ఉపాధ్యాయులపై కేసులు ఎత్తివేత :: గౌ || మంత్రి నారా లోకేష్ గారు*

ఆంధ్రప్రదేశ్‌‌లో ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది.

గత ప్రభుత్వంలో హక్కుల కోసం టీచర్లు రోడ్డెక్కారని.. గత ప్రభుత్వం టీచర్లపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉన్నామని.. ఆంధ్రప్రదేశ్ మోడల్ ఎడ్యుకేషన్‌లో ఉపాధ్యాయుల్ని భాగస్వామ్యం చేస్తామని చెప్పారు.

ఉపాధ్యాయుల విధులపై జీవో 117కు ప్రత్యామ్నయాలు పరిశీలిస్తున్నామని.. ఉపాధ్యాయులను బోధనా విధులకు మాత్రమే పరిమితం చేస్తామని తెలిపారు.

ఉపాధ్యాయులతో చర్చలకు సిద్ధమన్నారు. ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకోడానికి కేటాయించామన్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో 6 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారన్నారు మంత్రి గారు

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి గారు కీలక ప్రకటన చేశారు. డీఎస్సీ విషయంలో న్యాయపరంగా చిక్కులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. డీఎస్సీపై లీగల్‌ ఒపినియన్‌ తీసుకుంటున్నామని.. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోపు డిఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నామన్నారు. డీఎస్సీకి సంబంధించి కొన్ని విషయాల్లో స్పష్టత రావాల్సి ఉందని.. న్యాయపరంగా ఎలాంటి వివాదాలు తావు లేకుండా నోటిఫికేషన్ ఇస్తామన్నారు. 1994 నుంచి డీఎస్సీపై, గతంలో డీఎస్సీలపై పడిన కేసును తెప్పించుకుని పరిశీలిస్తున్నామని.. పకడ్బందీగా నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.

గత ఐదేళ్లలో ఉద్యోగ నియమకాలు సున్నా.. డీఎస్సీ ద్వారా ఒక్క పోస్టు భర్తీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే మొత్తంగా 15సార్లు డీఎస్సీ నిర్వహించామన్నారు. ప్రస్తుతం కూటమి సర్కార్ మెగా డీఎస్సీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందని.. ఉపాధ్యాయ నియామకాల్లో వయో పరిమితి పెంపు డిమాండ్‌ను పరిగణలోకి తీసుకున్నట్లు చెప్పారు. అన్ని శాఖల మధ్య ఫైల్ సర్క్యూలేషన్‌లో ఉందని.. ఎంత వయోపరిమితి పెంచుతామనేది త్వరలోనే స్పష్టత ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చిన హామీకి కట్టుబడి డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేశారన్నారు. మెగా డీఎస్సీ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు మంత్రి లోకేష్ గారు .

మరోవైపు రాష్ట్రంలో 20 నుంచి 30 కిలోమీటర్ల మధ్య డిగ్రీ కళాశాల ఉండాలనే నిబంధన ఉందన్నారు మంత్రి గారు...గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్ధులకు టెక్ట్స్ బుక్స్ కూడా ఇవ్వలేదని.. ఇంటర్మీడియట్ ఎడ్యూకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్‌కు చాలా తేడా ఉంటుందన్నారు. ఈ ఏడాది 10 శాతం అడ్మిషన్లు పెరిగాయని.. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు నారాయణ కాలేజీలతో పోటీ పడేలా నడుపుతామన్నారు. అంతేకాదు రాష్ట్రంలో స్కూల్‌లకు ర్యాంకింగ్ మెకానిజం పెడదామనే ఆలోచన ఉందని..డిసెంబర్ మొదటి వారంలో పిటీఎం నిర్వహిస్తున్నామని.. సభ్యులు కూడా పాల్గొనాలని కోరారు లోకేష్ గారు..
💥 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) విజయవాడ, కర్నూలు జోన్లలో వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

🔷️APSRTC Recruitment 2024 – Apply Online for 606 Apprentice Posts

▪️Post : Apprentice
▪️Vacancies : 606
▪️Qualification : ITI
▪️Last Date : 20th November

🔹Complete Details👇
https://www.thelocalhub.in/2024/11/apsrtc-recruitment-2024-apply-online.html
*15 November 2024*

💠 *International News::*

📌Over 80 world leaders promise commitments on climate action at COP29 in Baku.

📌 Philippines issues highest storm alert, evacuates thousands ahead of Super Typhoon Usagi.

💠 *National news:*

📌Dominica to Confer Highest National Honour to Prime Minister Narendra Modi.

📌Defence Research and Development Organisation (DRDO) completes Flight Tests of Guided Pinaka Weapon System.

📌Fast-paced progress of tribal communities is the national priority says President Droupadi Murmu.

💠 *State News:*

📌AP Government Employs Drones in Fight Against Cannabis Cultivation.

📌AP Aims for Development Through Port-Based Industries, Says CM Chandrababu Naidu.

📌Education Department issued orders to not to utilise Government School Premises for any kind of Private Events.

💠 *Sports News:*

📌 India thrash Thailand 13-0 in Women’s Asia Hockey Trophy in Bihar.

📌India to face South Africa in 4th and Final T20I at Wanderers Stadium in Johannesburg this Evening.

That's the end of the news

Thank You
*IMP NOTE ::*
రేపు ఆప్షనల్ సెలవు ప్రకటించిన పాఠశాలల ఉపాధ్యాయులు అందరూ తమ School Attendance APP లో వ్యక్తిగతంగా OH అప్లై చేయాలి

▪️Open School Attendance APP
▪️Scroll down.. To.. Apply Optional Holiday
▪️Select Kartika Paurnami
▪️Click in APPLY
అన్ని ప్రభుత్వ పాఠశాలల ఆవరణలలో రాజకీయ, మత, వివాహ సంబంధమైన కార్యకలాపాలకు అనుమతిని నిషేధిస్తూ మెమో జారీ చేసిన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్*
🔷️Last Chance to Apply🔷

‼️Last Date : Tomorrow‼️

💥PRAGATHI SCHOLARSHIP: డిప్లొమా/ఇంజనీరింగ్ చదివే విద్యార్థినులకు రూ.50,000 అందించే ప్రగతి స్కాలర్షిప్.

🔹Pragati Scholarship for Girls 2024-25 by Govt of India AICTE
▪️Benefit : 50,000/-

🔹పూర్తి వివరాలు👇
https://www.thelocalhub.in/2024/07/aicte-pragati-scholarship-for-girls.html
As per the instructions of the State Project Director of Samagra Shiksha, two office bearers from each following recognized unions are requested to participate in a discussion regarding academic issues.

The meeting is scheduled on Friday, 15th November 2024, from 4:00 PM to 5:00 PM at Samagra Shiksha Conference Hall.

It is requested your presence at the meeting at the designated time.

Thank you for your attention and cooperation.
*🌷GVWV & VSWS Department – Payment of salaries linked with Bio Metric attendance to the Village / Ward Secretariat functionaries for the period 01-11-2024 to 30-11-2024 – certain instructions issued – Regarding.*

*🌴The Bio Metric attendance period cycle for the November 2024 is from 23-10-2024 to 22-11-2024 (the attendance period cycle mentioned is only for purpose of determining the attendance of the employee. Based on attendance days in above cycle, the salary needs to be paid proportionately for the month of November 2024 from 01-11-2024 to 30-11-2024).*

*🍁Deduct the salary for the un authorized absent days in the attendance cycle period i.e. from 23-10-2024 to 22-11-2024.*

*(Absent days = Total days in attendance calendar – (present days + holidays + leaves + attendance authorized)*
*✳️రాష్ట్ర వార్తలు:*
▪️రాష్ట్రంలో సామాజిక మాధ్యమాలలో అసభ్య అణుచితాభ్యంతరకర పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని నిలువరించలేమని తెలియజేసిన హైకోర్టు ఈ విషయంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తిరస్కరించింది.
▪️ఇద్దరి కంటే ఎక్కువ సంతానం గల వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులు అన్న నిబంధనను ఎత్తివేస్తూ ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును శాసనసభ నిర్ణ ఏకగ్రీవంగా ఆమోదించింది.
▪️ఈ ఏడాది నుంచి ఖరీఫ్ రబీ లలో వేసే పంటలతో పాటు మామిడి తోటలకు బీమా పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు.
▪️గ్రామ వార్డు సచివాలయాలలో ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా ఈ నెల నుంచి జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
▪️బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడినట్లు, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో నేటి నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, శుక్ర, శనివారాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది.
▪️జ్యుడిషియల్ అధికారుల పదవీ విరమణ వయసును 60 నుంచి 61 కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
▪️కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే రూ. 11,498 కోట్లతో విశాఖపట్నంలో తొలిదశ మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలియజేశారు
▪️ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అర్హులైన 22,558 మంది విద్యార్థులకు రవాణా భత్యం క్రింద రూ.13.53 కోట్లు విడుదల చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.
▪️రాష్ట్రవ్యాప్తంగా న్యాయ కళాశాలలలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ లా సెట్ రెండో విడత కౌన్సిలింగ్ ను ఈనెల 14 నుంచి 17 వరకు నిర్వహిస్తామని లా సెట్ కన్వీనర్ తెలియజేశారు.

*✳️క్రీడా వార్తలు:*
▪️ప్రో కబడ్డీ సీజన్ 11 లో భాగంగా నిన్న నోయిడా లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ 47-28 తో బెంగాల్ వారియర్స్ ను ఓడించగా మరో మ్యాచ్ లో హరియానా స్టీలర్స్ 37-32 తో పట్నా పైరేట్స్ ను ఓడించింది.
▪️దక్షిణాఫ్రికా తో 4 మ్యాచ్ ల టి20 క్రికెట్ సిరీస్ లో భాగంగా నిన్న సెంచూరియన్ లో జరిగిన మూడవ మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది.
*♻️నేటి వార్తలు(14.11.2024)*

*✳️నేటి ప్రత్యేకత* :

▪️బాలల దినోత్సవం (భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు అయిన నవంబర్ 14న ప్రతి సంవత్సరం బాలల దినోత్సవం నిర్వహిస్తారు
▪️ప్రపంచ మధుమేహ దినోత్సవం (మధుమేహ చికిత్స లో ఉపయోగించే ఇన్సులిన్ ను కనుగొన్న ఫ్రెడరిక్ బాంటింగ్ జన్మదిన నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవంగా 1991 నుండి నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది)
▪️అంతర్జాతీయ బాలిక దినోత్సవం (బాలికల సంరక్షణ అభివృద్ధిపై అవగాహన కలిగించడానికి 1897 నుండి ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు) ప్రపంచ నాణ్యతా దినోత్సవం (2008 నుండి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది)

*✳️అంతర్జాతీయ వార్తలు::*
▪️అంతరిక్ష యాత్రికులపై బ్రిటన్ రచయిత్రి సమంతా హార్వే రాసిన 'ఆర్బిటల్' నవల 2024 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ విజేతగా ఎంపికైంది.
▪️అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత డోనాల్డ్ ట్రంప్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్, భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి లను తన ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డోజ్) సంయుక్త సారధులుగా నియమించారు.
▪️ ఎర్ర సముద్రంలో అమెరికాకు చెందిన యుద్ధనౌకలు యూ ఎస్ ఎస్ స్టాక్ డేల్, యూ ఎస్ ఎస్ స్పూ, యెన్స్ ల పై హూతీ తిరుగుబాటుదారులు క్షిపణులు డ్రోన్లతో దాడులు చేశారు.
▪️శ్రీలంకలో 1.70 కోట్ల ఓటర్లు నేడు 225 మంది పార్లమెంట్ సభ్యుల స్థానాలకు జరగనున్న ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
▪️డయాబెటిస్ నియంత్రణకు వాడే మెట్ఫార్మిన్ ఔషధాన్ని గర్భిణులు వినియోగిస్తే పిండంపై దుష్ప్రభావం పడే ప్రమాదం ఉందని అమెరికాలోని బెయిలర్ వైద్య కళాశాల పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది.
▪️అమెరికా అధ్యక్షుడుగా జో బైడెన్ పదవీకాలం ముగిసేలోగా వచ్చే ఏడాదికి సరిపడా ఆయుధాలు ఉక్రెయిన్ కు అందజేయను ఉన్నామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలియజేశారు.
▪️అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లో తాను ఆరోగ్యంగానే ఉన్నానని భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ తాజాగా వీడియో ఇంటర్వ్యూలో తెలియజేశారు.

*✳️జాతీయ వార్తలు:*
▪️దేశంలో కొన్ని రాష్ట్రాలలో అమలు చేస్తున్న నిందితులు, దోషుల ఆస్తులను కూల్చివేసే అధికారం ప్రభుత్వాలకు లేదని, ముందుగా షోకాజ్ నోటీసు ద్వారా తగినంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
▪️ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ నియామక పరీక్షలలో కోచింగ్ రంగంలో తప్పుదోవ పట్టిస్తూ జారీ చేసే ప్రకటనల నియంత్రణకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నిన్న మార్గదర్శకాలు జారీ చేసింది.
▪️జార్ఖండ్ లోని 43 అసెంబ్లీ స్థానాలకు నిన్న జరిగిన ఎన్నికలలో 66.18% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలియజేసింది. సుప్రీంకోర్టు న్యాయ సేవలు కమిటీ (ఎస్ సి ఎల్ ఎస్. సి) చైర్మన్ గా జస్టిస్ సూర్యకాంత్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నామినేట్ చేశారు.
▪️దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం అత్యంత దట్టమైన పొగ మంచు కమ్మేయడంతో పలు విమానాలను దారి మళ్ళించారు.
▪️క్లిష్టమైన ఆరోగ్య సమస్యలను పరిష్కారాలను కనుగొనడానికి శాస్త్రవేత్తలు వినూత్న ఆలోచనలను నవంబర్ 5వ తేదీలోగా "ఫస్ట్ ఇన్ ద వరల్డ్" పేరుతో నిర్వహిస్తున్న పోర్టల్ లో సమర్పించాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) కోరింది.
▪️మణిపూర్ లో ఇటీవల చెలరేగిన హింసాత్మక సంఘటనల నేపథ్యంలో 2000 మంది సిబ్బందితో కూడిన మరో 20 కంపెనీల కేంద్ర సాయిధ పోలీసు బలగాలను కేంద్ర హోం శాఖ తరలించింది.
See more posts

View in Telegram